News October 9, 2025

పాక్‌ను ట్రోల్ చేస్తూ IAF డిన్నర్ మెనూ!

image

IAF 93వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ మెనూ వైరల్ అవుతోంది. ‘ఆపరేషన్ సిందూర్’, ‘ఆపరేషన్ బందర్’(2019)లో ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేసిన పాక్ సిటీల పేర్లు ఫుడ్ ఐటమ్స్‌కు పెట్టారు. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా, బహవల్పూర్ నాన్, సర్గోదా దాల్ మఖానీ, జకోబాబాద్ మేవా పులావ్, మురిద్కే మీఠా పాన్ అంటూ మెనూకార్డ్ రూపొందించారు. దీంతో IAF ట్రోలింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News October 9, 2025

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

image

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీలు, IT సంస్థలు, ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో నెలకొక పెయిడ్ లీవ్ చొప్పున ఇవ్వాలని వెల్లడించింది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

News October 9, 2025

రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: ఆర్.కృష్ణయ్య

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బీసీల నోటికాడి ముద్దను లాగేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇవాళ సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన చూసి రేపటి నుంచి బంద్‌కు పిలుపునిస్తామని స్పష్టం చేశారు.

News October 9, 2025

ప్రభుత్వం ముందున్న అవకాశాలేంటి?

image

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ముందు 3 అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 1. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. 2. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లడం. 3. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ 4 వారాలు వేచి చూడటం.