News June 25, 2024

గుల్బాదిన్ గాయంపై ఇయాన్ స్మిత్ సెటైర్లు

image

కాలి కండరం పట్టేసిన అఫ్గానిస్థాన్ ప్లేయర్ గుల్బాదిన్ నాయబ్ నిమిషాల్లోనే తిరిగి పరిగెత్తడంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ డేవిడ్ స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నేను గత 6 నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. ఈ గేమ్ ముగిసిన వెంటనే గుల్బాదిన్‌కు చికిత్స అందించిన వైద్యుడిని కలవబోతున్నా. అతను ప్రస్తుతం ప్రపంచంలోని 8వ అద్భుతం అని నేను అనుకుంటున్నా’ అని సెటైర్లు వేశారు.

Similar News

News April 4, 2026

ఇండక్షన్ స్టవ్‌ల తయారీకి ప్రభుత్వం బూస్ట్?

image

ఇండక్షన్ స్టవ్‌లు, హీటర్లు, వాటికి సరిపోయే పాత్రల తయారీని పెంచేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వివిధ డిపార్ట్‌మెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. యుద్ధం వల్ల వంట గ్యాస్ కొరత తలెత్తిన నేపథ్యంలో ఇండక్షన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.

News April 4, 2026

కాలం మారినా మన భూమి అందం మారలేదు!

image

చంద్రుడి కక్ష్యలోకి మనిషి వెళ్లిన 54 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేస్తూ NASA ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 1972లో అపోలో-17 వ్యోమగాములు తీసిన ఫొటోను, తాజాగా ఆర్టెమిస్-2 బృందం తీసిన చిత్రాన్ని పోల్చుతూ ట్వీట్ చేసింది. ‘కాలం మారినా అంతరిక్షం నుంచి మన భూమి అందం మాత్రం అస్సలు తగ్గలేదు’ అని పేర్కొంది. ఈ రెండు చిత్రాలు నాటి జ్ఞాపకాలను, నేటి సాంకేతిక అభివృద్ధిని మనకు గుర్తుచేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?

News April 4, 2026

ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఆ గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్లు నిషేధం!

image

TG: ఐస్‌క్రీమ్ కల్తీ నుంచి పిల్లలను కాపాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని 3 గ్రామాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధించాయి. ఆర్మూర్(M) అంకాపూర్, జక్రాన్‌పల్లి(M) కొలిపాక, వేల్పూర్(M) అంక్సాపూర్ గ్రామాలు దీనిపై తీర్మానం చేశాయి. నిబంధన ఉల్లంఘిస్తే ₹5వేల జరిమానా విధిస్తామని ప్రకటించాయి. ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో ఐస్‌క్రీమ్ కల్తీలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.