News February 26, 2026

IASల బదిలీ: ఒకే జిల్లాలో భార్యాభర్తల విధులు

image

IASల బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దంపతులకు ఒకే జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చారు. హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయిని నియమించగా, ఆమె భర్త వరుణ్ రెడ్డి ప్రస్తుతం NPDCL సీఎండీగా హనుమకొండలోనే ఉన్నారు. స్నేహ శబరీశ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం అదే జిల్లాకు SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి.

Similar News

News April 15, 2026

కర్నూలు @44. 2°C

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News April 15, 2026

అమరావతిలో నేడు కూటమి నేతల కీలక భేటీ?

image

అమరావతిలో నేడు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగే ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, కూటమి పార్టీల సమన్వయంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .

News April 15, 2026

NTR: నగ్న చిత్రలు SMలో పెడతానని బెదిరింపు.. చివరికి..!

image

నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని మహిళను బెదిరించి నగదు వసూలు చేస్తున్న బాల వెంకటేశ్వర్లును భవానిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. భయపడి గతంలోనే బాధితురాలు పలుమార్లు నిందితుడికి నగదు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.