News May 21, 2024

IAS-IPS విడాకులు.. కట్ చేస్తే.. కరెంట్ కట్

image

తమిళనాడు మాజీ DGP రాజేశ్ దాస్- మాజీ భార్య బీలా ఇంటిపోరు రచ్చకెక్కింది. దాస్ ఉంటున్న బంగ్లా కరెంట్ కనెక్షన్‌ను బీలా తొలగింపజేశారు. విడాకులకు ముందు జాయింట్ లోన్‌తో బంగ్లా కొన్నా, కరెంట్ కనెక్షన్ తన పేరిట ఉందని ఆమె తెలిపారు. అందుకే తొలగింపజేశానన్నారు. కానీ తనను వేధించేందుకు బీలా విద్యుత్ శాఖ సెక్రటరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని దాస్ వాపోయారు. మరి ఈ ఇంటి కరెంటు పంచాయితీ ఎటు చేరేనో?

Similar News

News November 19, 2025

MNCL: ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలి

image

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తోందన్నారు.

News November 19, 2025

ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

image

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్‌ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్‌కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.

News November 19, 2025

నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

* గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED