News February 19, 2025

ఐఏఎస్‌లు బానిసల్లా పనిచేయొద్దు: ఈటల

image

TG: కాంగ్రెస్ పాలనలో అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లు నేతలకు బానిసల్లా పనిచేయొద్దని అన్నారు. ప్రభుత్వాలు ఐదేళ్లే ఉంటాయని, ఐఏఎస్‌లు 35 ఏళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేతలకు అనుగుణంగా పనిచేసేవారు గతంలో జైలు పాలయ్యారని చెప్పారు. తాము కాషాయ బుక్ మెంటైన్ చేస్తున్నామని, అలాంటి వారు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

Similar News

News October 21, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 72,026 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

News October 21, 2025

సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలకు చిరునామా ఆయన

image

సామాజిక అంశాలనే కథాంశంగా సంచలన సినిమాలు తీసిన దర్శకుడిగా టి.కృష్ణ పేరొందారు. విజయశాంతిని స్టార్‌ను చేసిన ‘ప్రతిఘటన’ చిత్రానికి ఆయనే డైరెక్టర్. నేటి భారతం, వందేమాతరం, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 1987లో కన్నుమూశారు. హీరో గోపీచంద్ ఈయన కుమారుడే. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి.

News October 21, 2025

సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

image

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్‌టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.