News December 21, 2025
iBOMMA రవి కేసు.. విచారణ గందరగోళం

పైరసీ వ్యవహారంలో అరెస్టైన iBOMMA రవిని టెక్నికల్ ఆధారాలతో ప్రశ్నించినా పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెబుతూ విచారణను గందరగోళంగా మారుస్తున్నాడని సమాచారం. తాను సినిమా పైరసీ ద్వారా డబ్బు సంపాదించలేదని తెలిపాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సంపాదించానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ యాప్ యజమానుల వివరాలను చెప్పలేదు. ఐబొమ్మ సైట్‌లో పనిచేసిన సిబ్బంది వివరాలపై కూడా మౌనం వహించాడు.
Similar News
News December 26, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 26, 2025
కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<
News December 26, 2025
లక్ష్మీదేవి కటాక్షం కోసం నేడు ఏం చేయాలంటే?

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఉప్పు కొనాలని పండితులు చెబుతున్నారు. అలాగే పడుకునేటప్పుడు ఈశాన్యంలో దీపం వెలిగించడం, ఆవులకు నెయ్యి, బెల్లం కలిపిన ఆహారం OR గడ్డి తినిపించడం మంచిదని అంటున్నారు. ‘లక్ష్మీదేవికి పూలను సమర్పించాలి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం గులాబీలు ఇవ్వాలి. సాయంత్రం పంచముఖి దీపం వెలిగించి, కర్పూరం హారతి బూడిదను పర్సులో ఉంచుకుంటే చేతిలో డబ్బు నిలుస్తుంది’ అని చెబుతున్నారు.


