News November 4, 2024
ఐబీపీఎస్ RRB మెయిన్స్ ఫలితాలు విడుదల

ఐబీపీఎస్ RRB పీవో మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in వెబ్సైట్లో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 2 ,3 ఉద్యోగాలకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెయిన్స్ ఎగ్జామ్‌ను ఐబీపీఎస్ నిర్వహించింది. మెయిన్స్‌లో పాసైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది.
Similar News
News December 7, 2025
నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యల్పంగా చారకొండ మండలంలో 15.2 సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 15.5, కల్వకుర్తి, అచ్చంపేట, పదర మండలాల్లో 15.9 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 7, 2025
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
News December 7, 2025
ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.


