News March 4, 2025

ICAI పరీక్షా ఫలితాల విడుదల

image

సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ICAI) ఈరోజు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది జనవరిలో 11, 13, 15, 17, 19, 21 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News March 26, 2026

అయ్యో.. పాపం!

image

AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఒక్కొక్కరి దీనగాథ హృదయ విదారకంగా ఉంది. కనిగిరి(M) మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45) తన కొడుకు మనోహర్‌ను కాపాడి తాను మరణించారు. కొనకనమిట్ల(M) పెదారికట్లకు చెందిన అంబటి అనిల్, 5 నెలల కొడుకు చనిపోగా అతని భార్య సౌజన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

News March 26, 2026

‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ మీమ్స్.. కారణమిదే!

image

ఇరాన్ సుప్రీంలీడర్‌గా తానే ఉండాలని ఆ దేశ నేతలు అడిగారని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పదవిని తాను కోరుకోలేదని గొప్పలు చెప్పడంపై మీమ్స్ పోటెత్తుతున్నాయి. ‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గడ్డంతో ఉన్న ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘అయతుల్లాగా ట్రంప్ ఛార్జ్ తీసుకున్నారు. పరిస్థితి దారుణంగా మారొచ్చు’ అని సెటైర్లు వేస్తున్నారు.

News March 26, 2026

‘చుప్పనాతి శూర్పణఖ’ అంటే ఎవరు?

image

మోసం, కపటం, ఓర్వలేనితనం వంటి గుణాలున్న మహిళల గురించి చెప్పే సందర్భంలో ‘చుప్పనాతి శూర్పణఖ’ జాతీయాన్ని వాడతారు. రామ రావణ యుద్ధానికి మూలకారణం శూర్పణఖ. ఆమె రావణాసురుడి చెల్లెలు. పంచవటిలో రాముడిని చూసి మోహించింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసేయడంతో ప్రతీకారంగా సీతపై తన అన్నకు కోరిక పుట్టేలా, రాముడిపై శత్రుత్వం పెరిగేలా చేసింది. మీ జీవితంలో చుప్పనాతి శూర్పణఖ ఎవరో కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>