News January 30, 2025
ICAI HYD బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ మెంబర్గా ADBవాసి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్యంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) HYD బ్రాంచ్ మేనేజింగ్ కమిటీకి ADBకు చెందిన CA శైలేష్ ఖండేల్వాల్ ఎన్నికయ్యారు. 2025-2029 కాలానికి ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలికి మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా పట్టణానికి చెందిన వ్యక్తి ఎన్నికకావడం విశేషమైంది. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.
News November 12, 2025
ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.
News November 12, 2025
ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.


