News December 30, 2024
ICAR శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా వాసి

తిరుమలాయపాలెం మండల పరిధి సుబ్లేడుకు చెందిన లత ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ (ICAR)పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగంలో భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని లత అన్నారు.
Similar News
News November 10, 2025
ఖమ్మం రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రమాద భయం

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్ యార్డుల కొరత ఉండటంతో రైతులు పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నారు. దీంతో వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News November 10, 2025
ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్డేట్ యాప్లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.
News November 10, 2025
‘వనజీవి రామయ్య’ బయోపిక్కు భట్టికి ఆహ్వానం

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.


