News December 30, 2024

ICAR శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా వాసి

image

తిరుమలాయపాలెం మండల పరిధి సుబ్లేడుకు చెందిన లత ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ (ICAR)పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగంలో భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని లత అన్నారు.

Similar News

News January 2, 2025

వరాహ అవతారంలో భద్రాద్రి రామయ్య

image

దక్షిణాది అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు గురువారం వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మహానివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, ఆలయ అధికారులు,భక్తులు పాల్గొన్నారు.

News January 2, 2025

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ సర్వే కోసం డిపాజిట్ చెల్లించండి: కేంద్ర మంత్రి

image

భద్రాద్రి జిల్లాలో ప్రతిపాదిత కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 41లక్షలు డిపాజిట్ చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి తుమ్మలకు లేఖ రాశారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి తుమ్మల లేఖ ద్వారా కోరారు. కాగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ 950ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే.

News January 2, 2025

ఖమ్మం జిల్లాలో రూ. 42 కోట్ల మద్యం అమ్మకాలు..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 30, 31న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం 208 దుకాణాల్లో ఒక్క రోజు అమ్మకానికి రూ.42 కోట్లు వసూళ్లయ్యాయి. ఇందులో బీర్లు 11,924, విస్కీ, బ్రాందీ ఇతర మద్యం బాటిళ్లు 29,979 కేసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.5 కోట్ల వరకు మద్యం అమ్ముడవుతుంది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతుండడంతో ఇదే స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.