News February 5, 2026

ICAR-IARIలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<>IARI<<>>) 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు దరఖాస్తును ఈ-మెయిల్ dk6473@gmail.comకు FEB 28 వరకు సెండ్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech/ME/MCA/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/

Similar News

News February 5, 2026

సంకటహర చతుర్థి.. సాయంత్రం ఇలా చేయండి!

image

సంకటహర చతుర్థి ఎంతో విశిష్ఠమైందని పండితులు చెబుతున్నారు. ‘ఇవాళ విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని భక్తితో పూజిస్తే జీవితంలోని సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం(నీళ్లు) సమర్పించాలి. తర్వాత గణేశుడిని పూజించుకోవాలి. కచ్చితంగా చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించుకోవాలి. ఇలా చేస్తే మనో ధైర్యం పెరిగి, బుద్ధి వికసిస్తుంది’ అని చెబుతున్నారు.

News February 5, 2026

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు FEB 13వరకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35Kవరకు, ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-రూ.25K వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://iith.ac.in

News February 5, 2026

స్వర్ణ వార్డు, గ్రామ సిబ్బందికి త్వరలో ప్రమోషన్లు

image

AP: స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు దక్కనున్నాయి. అర్హతలు, సీనియార్టీ, పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు ఇవ్వనుంది. అలాగే రేషనలైజేషన్ పూర్తి చేసి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో వీరిని నియమించాలని భావిస్తోంది. ఆఫీసుల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించనుంది. దీనివల్ల ఉద్యోగులకు మేలు చేకూరి ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని భావిస్తోంది.