News December 25, 2024
ICC ప్రపంచకప్ టీంలో భద్రాచలం ప్లేయర్

జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న ICC అండర్-19 మహిళల ప్రపంచ్ కప్‌కు టీమిండియా స్క్వాడ్‌ను BCCI మంగళవారం ప్రకటించింది. ACC ఛాంపియన్ షిప్లో రాణించిన భద్రాచలం ప్లేయర్ గొంగిడి త్రిషకు చోటు దక్కింది. కాగా ఇండియా ఆసియా కప్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు, టోర్నీ అంతా నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచింది.
Similar News
News November 21, 2025
ఖమ్మం ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

‘లక్కీ డ్రా’ పేరుతో వచ్చే మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని వన్ టౌన్ సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయాలని, వివరాలు తెలిపిన వారి ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు.
News November 21, 2025
ఖమ్మం: ఆర్వో ప్లాంట్ల దందా.. ప్రజారోగ్యానికి ముప్పు

ఖమ్మం జిల్లాలోని అనేక ఆర్వో వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పరిశుభ్రత పాటించకపోవడంతో నీటిలో ఈ-కోలీ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. అధికారుల నిఘా లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 21, 2025
ఖమ్మంలో రేపు జాబ్ మేళా.. నిరుద్యోగులకు అవకాశం

ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన కోసం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో(శనివారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. SSC నుంచి డిగ్రీ వరకు అర్హత ఉండి, 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు. మారుతి ఆగ్రో అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని చెప్పారు. వివరాలకు 96667 10273ను సంప్రదించాలి.


