News June 30, 2024

రోహిత్‌ లేకుండా ఐసీసీ ఫాంటసీ బెస్ట్ టీమ్

image

T20 WC2024 ముగియడంతో ICC బెస్ట్ ఫాంటసీ టీమ్‌ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా అందులో టైటిల్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్‌శర్మకు చోటు దక్కలేదు. భారత్, అఫ్గాన్ జట్ల నుంచి ముగ్గురి చొప్పున ఎంపికవగా విచిత్రంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన AUS నుంచీ ముగ్గురు చోటు దక్కించుకున్నారు.
జట్టు: రషీద్‌ ఖాన్‌(C), గుర్బాజ్‌, హెడ్, వార్నర్, స్టబ్స్, హార్దిక్ పాండ్య, స్టోయినిస్, ఫరూఖీ, బుమ్రా, అర్ష్‌దీప్, రిషద్.

Similar News

News January 7, 2026

10 ఏళ్ల పిల్లాడికి హార్ట్ ఎటాక్.. రీల్స్ చూస్తుండగా..

image

హార్ట్ ఎటాక్‌తో పెద్దలే కాదు యువకులు, పిల్లలు <<18554317>>చనిపోతున్న<<>> ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా UPలోని అమ్రోహ(D)లో 4వ తరగతి చిన్నారి మరణించాడు. మయాంక్(10) రీల్స్ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారని, హార్ట్ ఎటాక్‌కు కారణమేంటో గుర్తించలేకపోయామని చెప్పారు.

News January 7, 2026

శునకాలు x సుప్రీంకోర్టు/ప్రజలు.. ఏమంటారు?

image

దేశంలోని రోడ్లు, పబ్లిక్ ప్లేసుల్లో శునకాలు తిరగడంపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. ‘కుక్క ఎప్పుడు కరిచే మూడ్‌లో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి వాటిని షెల్టర్స్‌కు తరలించాలి. హైవేలపై డాగ్స్ కరవకపోవచ్చు. కానీ ప్రమాదాలకు కారణం అవుతాయి. చికిత్స కంటే నిరోధం ఉత్తమం’ అని వ్యాఖ్యానించింది. ప్రజల, కుక్కల లైఫ్ దృష్ట్యా SC ఇస్తున్న ఆదేశాలపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకీ మీరేమంటారు?

News January 7, 2026

కంది గింజలను నిల్వచేసే సమయంలో జాగ్రత్తలు

image

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.