News March 12, 2025

ఇండియాకు ICC ఫేవర్‌గా ఉంటోంది: వెస్టిండీస్ లెజెండ్

image

భారత్‌కు అనుకూలమయ్యేలా ICC నిర్ణయాలు ఉంటున్నాయని WI లెజెండరీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ అన్నారు. CTలో IND మ్యాచులన్నీ ఒకే వేదికపై నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ‘గత T20 WCలోనూ INDకి ఫేవర్‌గా నడుచుకున్నారు. సెమీస్ వెన్యూ వారికి ముందే తెలిసింది. నా దృష్టిలో ICC అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు. క్రికెట్‌లో నో బాల్స్, వైడ్లు ఉండకూడదని ఇండియా కోరితే ICC ఆ రూల్‌ను కూడా తీసుకొస్తుంది’ అంటూ విమర్శించారు.

Similar News

News March 12, 2025

ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా గిల్

image

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. గత నెలలో 5 వన్డేలాడి 94.19 యావరేజ్‌, 101.50 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ సహా మూడు వరుస ఫిఫ్టీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ గట్టి పోటీ ఉన్నా వారిని వెనక్కి నెట్టి గిల్‌ ఈ అవార్డు దక్కించుకున్నారు.

News March 12, 2025

రన్యారావును నిద్రపోనివ్వడం లేదు: లాయర్లు

image

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మర్డర్ కేసుల్లోనే మహిళలకు బెయిల్ లభిస్తోందని, అలాంటప్పుడు బెయిల్ పొందడానికి రన్యా కూడా అర్హురాలని వాదనలు వినిపించారు. కాగా రన్యారావు దుబాయ్ నుంచి నడుము చుట్టూ, కాళ్ల కింద భాగం, షూలో 14 కిలోల బంగారం అక్రమంగా తీసుకువస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.

News March 12, 2025

పండగే.. వచ్చే 19 రోజుల్లో 8 రోజులు సెలవులు

image

ఐటీ, ITES ఉద్యోగులకు రానున్న రెండు వారాలు ఆఫీసులకు వెళ్లినట్లే అన్పించదు. ఎందుకంటే మాసంలో మిగిలిన 19 రోజుల్లో 8 రోజులు సెలవులే. 14న హోలీ, 15-16 వీకెండ్ కావడంతో వరుసగా మూడ్రోజులు హాలీడే. ఇక 22-23 వీకెండ్. తిరిగి 29న వీకెండ్, 30 సండే+ఉగాది ఉండగా 31న రంజాన్ సందర్భంగా సెలవు. మొత్తం 8 సెలవుల్లో 2సార్లు 3 రోజుల చొప్పున లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో సరదాగా ట్రిప్‌కు వెళ్లే వారు ప్లాన్స్ మొదలుపెట్టారు.

error: Content is protected !!