News October 30, 2024
ICC ర్యాంకింగ్స్: బుమ్రా కిందకి.. జైస్వాల్ పైకి
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా 3వ స్థానానికి పడిపోయారు. అశ్విన్ 4, జడేజా 8వ స్థానంలో ఉన్నారు. ఈ విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 3వ స్థానానికి ఎగబాకారు. టాప్-10లో భారత్ నుంచి అతనొక్కడే ఉన్నారు. ఈ విభాగంలో టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ ఉన్నారు.
Similar News
News October 30, 2024
ALERT.. కాసేపట్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 30, 2024
పార్టీ నేతలకు CM రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
TG: పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్‌మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.
News October 30, 2024
రేవంత్ కామెంట్స్‌పై స్పందించిన హరీశ్‌రావు
TG: తనను ఎలా డీల్ చేయాలో తెలుసని CM రేవంత్ చేసిన కామెంట్స్‌పై హరీశ్‌రావు స్పందించారు. తనను డీల్ చేయడానికంటే ముందు సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని చెప్పుకుంటున్న రేవంత్ వచ్చే ఎన్నికల్లో సెల్ఫ్‌గోల్ కొట్టుకోవడం తప్పదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఫుట్‌బాలర్ అయితే తాను క్రికెట్ ఆడుతానని, వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని జోస్యం చెప్పారు.