News March 11, 2025

ICET నోటిఫికేషన్ విడుదల

image

AP ఐసెట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 13వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 9 వరకు అప్లై చేయవచ్చు. మే 7వ తేదీన ఉదయం 9-11.30 వరకు, మ.2-4.30 వరకు పరీక్ష జరుగుతుంది. ఫీజు OCలు రూ.650, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.550 చెల్లించాలి.

Similar News

News November 1, 2025

తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: దేవాదాయ శాఖ

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటనపై దేవాదాయ శాఖ స్పందించింది. అది పూర్తిగా ప్రైవేటు గుడి అని, ప్రభుత్వ అధీనంలో లేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ప్రభుత్వానికి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు.

News November 1, 2025

కన్నడను కాదనే వారందరూ మన వ్యతిరేకులే: సిద్దరామయ్య

image

హిందీ, సంస్కృతాల ప్రోత్సాహానికి అధిక నిధులు కేటాయిస్తూ ఇతర భాషలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కర్ణాటక CM సిద్దరామయ్య విమర్శించారు. ‘రాష్ట్రం నుంచి ₹4.5 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్తుండగా మనకు సరైన వాటా మేరకు నిధులు అందడం లేదు. అరకొరగా విదిలిస్తున్నారు’ అని మండిపడ్డారు. కన్నడను వ్యతిరేకించే వారందరినీ మనమూ వ్యతిరేకించాల్సిందేనని రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఆయన పిలుపునిచ్చారు.

News November 1, 2025

కాశీబుగ్గ ఘటనపై విచారణకు ఆదేశం

image

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.