News March 17, 2024

ఇచ్చాపురం: ఆ కుటుంబాల మధ్య మరోసారి పోటీ

image

ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నుంచి బెందళం, పిరియా కుటుంబాల మధ్య మరోసారి పోటీ పడనున్నాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బెందళం అశోక్ బాబు పోటీ చేయగా వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీ చేశారు. అశోక్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బెందళం అశోక్ పోటీకి సిద్ధం కాగా పిరియా సాయిరాజ్ భార్య విజయ పోటీ పడనున్నారు.

Similar News

News April 3, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

శ్రీకాకుళం, పలాస మీదుగా హైదరాబాద్(HYD)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నం.07165 HYD- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News April 3, 2025

ఆమదాలవలస: ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన యువతి

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని బోదేపల్లి రాజగోపాల్ నగర్‌కి చెందిన జ్యోత్స్నకి రెండు రోజులు కిందట వెలువడిన ఫలితాలో మూడు బ్యాంకు ఉద్యోగాలు, ఎల్ అండ్ టి కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌గా ఎంపికైంది. ఈమె తల్లితండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. జ్యోత్స్నకి పలువురు అభినందించారు.

News April 3, 2025

శ్రీకాకుళం: పోలీసులకు చిక్కిన ప్రేమోన్మాది నవీన్

image

విశాఖపట్నంలోని మధురవాడలో బుధవారం నవీన్ అనే ప్రేమోన్మాది దీపిక, ఆమె తల్లి లక్ష్మిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిపోతున్న నిందితుడు నవీన్‌ను SKLM జిల్లా బూర్జలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత స్పందించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి విశాఖకు తరలించారు.

error: Content is protected !!