News March 17, 2024

ఇచ్ఛాపురం: కూలీ బిడ్డ.. గేట్‌లో మెరిసి

image

ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామపంచాయతీ ఎ.బలరాంపురం గ్రామానికి చెందిన ఎ.నీలాద్రి 2024 గేట్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియాలో 343వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన నీలాద్రి కఠోర సాధనతో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం పై పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్నేహితుడు శంకర్ సహాయంతో ఈ విజయం సాధించినట్లు నీలాద్రి తెలిపారు.

Similar News

News January 27, 2026

విశాఖలో IND, NZ మ్యాచ్..వాహనాల పార్కింగ్ స్థలాలు ఇవే

image

విశాఖలో బుధవారం ఇండియా, నూజిలాండ్ మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మార్గంలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు నేడు విధించారు. VVIP, VIP వాహనాలను స్టేడియంలోని (P1, P2)లో, మీడియావి గేట్-10 వద్ద పార్కింగ్ చేయాలన్నారు. సాధారణ బండ్లకు సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ, విజగ్ కన్వెన్షన్, లా కాలేజీ రోడ్లలో నిలపాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని పోలీసులు చెప్పారు.

News January 27, 2026

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు

image

కిల్లిపాలేం గ్రామ సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ హేమ రాగిణి శాలరీ ఏరియర్స్ బిల్లులు నిలిచిపోయాయి. ఈ బిల్లలు చెల్లించాలని ఇటీవల ఆమె శ్రీకాకుళంలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లగా ట్రెజరీ ఆఫీసర్ రవి ప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు‌లు రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆమె ఏసీబీ అధికారులను సంప్రదించగా..ఇవాళ సదరు డిజిటల్ అసిస్టెంట్ నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.

News January 27, 2026

పలాస: కుటుంబ కలహాలతో యువకుడి హంగామా

image

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.