News May 6, 2024
ICSE 10th, ISC 12th ఫలితాలు విడుదల
ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి <
Similar News
News December 29, 2024
నితీశ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: గవాస్కర్
తాను ఎక్కడి నుంచి వచ్చానన్న సంగతిని నితీశ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సూచించారు. ‘ఇది నితీశ్‌కు తొలి సెంచరీ. మున్ముందు ఇలాంటి మరెన్నో సాధిస్తారు. భారత క్రికెట్‌కు ఇప్పుడు అతనో స్టార్. కానీ ఎప్పుడూ క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. కుటుంబం తన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదు. మూలాల్ని మరచిపోకుండా ఉంటే అతడికి ఉజ్వలమైన కెరీర్ ముందుంది’ అని పేర్కొన్నారు.
News December 29, 2024
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: మల్లు రవి
దివంగత మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు భారత దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ‘మన్మోహన్ మృతి మన దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలే దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించాయి. దేశం ఓ మహానేతను కోల్పోయింది. ఆయన సేవలకు ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
News December 29, 2024
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?
AP: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.