News February 9, 2026
ICSILలో డేటా ఎంట్రీ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<
Similar News
News February 9, 2026
కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News February 9, 2026
రింకూ సింగ్ పెళ్లి మరోసారి వాయిదా

ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ MP ప్రియా సరోజ్ పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ నెలలోనే జరగాల్సి ఉండగా.. T20 WC, IPL నేపథ్యంలో ముహూర్తం జూన్‌కు మార్చినట్లు రింకూ సోదరుడు సోనూ వెల్లడించారు. కాశీలో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్ 8న వీరి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తొలుత పెళ్లికి నవంబర్‌లో డేట్ ఫిక్స్ చేశారు.
News February 9, 2026
పనులన్నీ సకాలంలో పూర్తికావాలి: పవన్

AP: క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని Dy.CM పవన్ స్పష్టం చేశారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘మేం నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు. అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయి. పల్లె పండుగ, అడవితల్లి బాట సహా పలు పథకాలకు రూ.11,328 కోట్లు మంజూరు చేశాం. పనులన్నీ సకాలంలో పూర్తికావాలి’ అని సూచించారు.


