News November 27, 2024
ఐడియా అదుర్స్: తాగిన మందు బాటిల్ వెనక్కిస్తే రూ.10

తమిళనాడులో మద్యం ప్రియులకు పెట్టిన ఓ కండిషన్ మంచి ఫలితాలిస్తోంది. బయట మద్యం తాగి బాటిళ్లు పడేయడంతో చెత్త పేరుకోవడంతో పాటు కొన్నిసార్లు గాయాలూ అవుతాయి. దీంతో బాటిల్ ధరపై షాపులు ₹10 ఎక్కువ తీసుకుని, ఏ వైన్స్లో వెనక్కిచ్చినా డబ్బు తిరిగివ్వాలని కోర్టు సూచించింది. దశల వారీగా దీన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు 10 జిల్లాల్లో ఉన్న రిటర్న్ స్కీమ్ను సర్కారు త్వరలో రాష్ట్రమంతా విస్తరించనుంది.
Similar News
News December 1, 2025
పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్సభ

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


