News November 1, 2024
అన్నక్యాంటీన్లలో ఉచిత భోజనం అందించే ఆలోచన: గంటా
AP: స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఉన్నామని టీడీపీ MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఇప్పటికే ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. అవసరమైతే మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందని వెల్లడించారు. విశాఖకు మరిన్ని IT కంపెనీలు తీసుకొచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని అన్నారు.
Similar News
News November 1, 2024
బ్యాక్ లాగ్ లేకుండా భర్తీ చేయాలని సీఎంకు అభ్యర్థుల విజ్ఞప్తి
TG: గ్రూప్-4 ఉద్యోగాల భర్తీలో నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీని ద్వారా గ్రూప్-4 కంటే పై స్థాయి ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు ఇందులో జాయిన్ కారని, పోస్టులు బ్యాక్ లాగ్ కావంటున్నారు. ఇలా భర్తీ చేస్తే మరో 3000 మందికి డౌన్ మెరిట్లో ఉద్యోగాలు వస్తాయంటున్నారు. లిస్ట్ ఇవ్వకముందే సీఎం రేవంత్, TGPSC ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News November 1, 2024
కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే చర్యలు: నిరంజన్
TG: కులగణనను రాజకీయం చేయవద్దని BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్ కోరారు. ‘ఇదొక బృహత్తర కార్యక్రమం. కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. BCల జనాభా తేల్చేందుకు ఈ సర్వే కీలకం. 52% BCలు ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని నిరూపించుకునేందుకు ఇదే అవకాశం. మళ్లీ కులగణన జరుగుతుందో లేదో తెలియదు. కులసంఘాలు దీనిలో కీలకపాత్ర పోషించాలి. ప్రజలూ సహకరించాలి’ అని కోరారు.
News November 1, 2024
రూపాయి: విలువ కంటే ఖర్చెక్కువ!
నిత్యం మనం వినియోగించే కరెన్సీ తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ₹1.11 ఖర్చు అవుతుంది. ఇది నాణెం విలువ కంటే ఎక్కువ. రెండు రూపాయల నాణేనికి ₹1.28, 5 రూపాయల నాణేనికి ₹3.69 ఖర్చవుతుంది. రూ.10 నోట్ల ముద్రణకు ₹0.96, ₹20కి ₹0.95, రూ.50కి ₹1.13, ₹100కి ₹1.77 ఖర్చవుతుంది. UPI వినియోగం అధికంగా ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటికీ ₹34.7 లక్షల కోట్ల నగదు సర్క్యులేషన్లో ఉంది.