News October 19, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు జవాన్ల వీరమరణం

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈరోజు ఉదయం స్థానిక ధుర్బేద ప్రాంతంలో కూంబింగ్ కోసం ఐటీబీపీ, జిల్లా రిజర్వు గార్డ్ బలగాలు వెళ్తున్న సమయంలో కొడ్లియార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీలోని కడపకు చెందిన కె రాజేశ్ అనే జవాను ఉండటం గమనార్హం.

Similar News

News November 3, 2025

తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

image

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.

News November 3, 2025

శక్తిమంతమైన శివ మంత్రాలు

image

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. క‌రచరణా కృతం వా కాయ‌జం క‌ర్మజం వా
శ్రవ‌న్నయ‌న‌జం వా మాన‌సం వా ప‌ర‌ధాం విహితం విహితం వా
స‌ర్వ మేత‌త క్షమ‌స్వ జ‌య జ‌య క‌రుణాబ్దే శ్రీ మ‌హ‌దేవ్ శంభో

News November 3, 2025

నిజమైన శివపూజ ఇదే!

image

శివపూజకు అన్నీ ఉండాలనుకోవడం మన అపోహ మాత్రమేనని పండితులు చెబుతున్నారు. శివుడు కోరేది నిర్మలమైన మనసు మాత్రమేనని అంటున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకపోయినా భక్తితో ‘స్వామి! నన్ను రక్షించు’ అని అడిగినా ఆయన ప్రసన్నుడవుతాడని పురాణాల వాక్కు. శివుడి పట్ల మనసు స్థిరంగా ఉంచడమే అసలైన శివభక్తి అని నమ్మకం. ఆయనతో కష్టసుఖాలు చెప్పుకొని, లాలించి, అలిగి, బుజ్జగించే మానసిక అనుబంధాలే అత్యంత ప్రీతిపాత్రమైనవని అంటారు.