News November 23, 2024

IESలో సిక్కోలు వాసికి మూడో ర్యాంక్

image

ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(IES) పరీక్షలో సిక్కోలు జిల్లా వాసి సత్తాచాటారు. పోలాకి మండలం జిల్లేడు మాకివలసకు గొల్లంగి సతీశ్ పరీక్ష రాయగా శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఆయన మూడో ర్యాంక్ సాధించారు. ఇదే పరీక్షల్లో గతేడాది 15వ ర్యాంకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన తన తల్లి నిర్మలమ్మ అండగా నిలవడంతో ఈ విజయం సాధించానని ఆయన తెలిపారు. 

Similar News

News November 22, 2025

ఆమదాలవలస: రైలు నుంచి జారిపడి ఒకరు మృతి

image

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస )రైల్వే స్టేషన్ సమీపంలో తాండ్రసి మెట్ట వద్ద రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉన్నాయని, నల్లటి దుస్తులు ధరించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు.

News November 22, 2025

కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

image

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

News November 22, 2025

శ్రీకాకుళం నుంచి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు

image

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) నుంచి ప్రశాంతి నిలయయానికి ప్రత్యేక రైలును శుక్రవారం శ్రీ సత్యసాయి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ప్రారంభించారు. ప్రత్యేక ట్రైన్‌లో సుమారు 1,400 భక్తులతో ప్రయాణమైందని ఆయన తెలిపారు. ఈనెల 23వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వందల పుట్టినరోజు సందర్భంగా ఈ రైలును ఏర్పాటు చేశామన్నారు.