News August 18, 2024

100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఏలేటి

image

TG: 100% రైతులకు రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని BJLP నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ కాలేదని తేలితే CM రేవంత్ రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై రైతుల సమక్షంలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేశారని ఆయన విమర్శించారు. రూ.49వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17వేల కోట్లిచ్చారని దుయ్యబట్టారు.

Similar News

News January 26, 2026

రేపు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన

image

దేశవ్యాప్తంగా రేపు నిరసన చేపట్టనున్నట్లు గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గిగ్ వర్కర్లను అధికారిక కార్మికులుగా గుర్తించడంతో పాటు సెంట్రల్ గిగ్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఆదాయ భద్రత లేకపోవడం, అకారణంగా ఐడీలు బ్లాక్ చేయడం, పారదర్శకత లేని రేటింగ్ వ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేసింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది.

News January 25, 2026

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్ స‌న్మానం

image

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు CM రేవంత్ రెడ్డి సన్మానం నిర్వహించనున్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ లభించగా, పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం తిరిగి వచ్చిన అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గతేడాది కూడా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు.

News January 25, 2026

టీమ్ ఇండియా ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్‌ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.