News September 3, 2024
వరదల్లో 28 మంది మరణిస్తే 16 అని చెప్పారు: హరీశ్ రావు

TG: సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని అన్నారు.
Similar News
News January 8, 2026
సంగారెడ్డి: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ పరీక్షలు మూడు విడతల్లో జరగనున్నట్లు, ప్రతి బ్యాచ్ 25 మంది విద్యార్థుల చొప్పున ఐదు రోజుల పాటు నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలో మాత్రమే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News January 8, 2026
‘అమెరికా సముద్రపు దొంగ’.. ఆయిల్ ట్యాంకర్ స్వాధీనంపై రష్యా ఫైర్

తమ ఆయిల్ ట్యాంకర్ను US స్వాధీనం చేసుకోవడంపై రష్యా నిప్పులు చెరిగింది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘన అని, అగ్రరాజ్యం చేస్తోన్న Outright Piracy (సముద్రపు దొంగతనం) అంటూ ఆ దేశ రవాణా శాఖ మండిపడింది. ఐస్లాండ్ సమీపంలో తమ నౌకతో కాంటాక్ట్ కట్ అయిందని, అమెరికా చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా సీనియర్ నేతలు హెచ్చరించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.


