News October 14, 2024

ఆడపిల్ల పుడితే రూ.5వేలు.. సర్పంచ్ అభ్యర్థి మ్యానిఫెస్టో!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కొందరు ఆశావహులు మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం తెస్తున్నారు. తాజాగా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న యాదాద్రి(D) తుర్కపల్లి(M) మల్కాపూర్‌కి చెందిన కొడారి లత మల్లేశ్ మ్యానిఫెస్టో వైరల్ అవుతోంది. ఆడబిడ్డ పుడితే ₹5వేలు, ఉచిత మంచి నీరు, ఇంటి పన్ను ఫ్రీ, ఎవరైనా మరణిస్తే ₹20 వేలు ఇస్తామంటూ ఆమె ఇచ్చిన హామీలు గ్రామస్థుల్ని ఆశ్చర్యపర్చాయి.

Similar News

News January 3, 2025

ప్రభుత్వం సంచలన నిర్ణయం?

image

TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News January 3, 2025

నేటి నుంచి నుమాయిష్

image

TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో 2వేల స్టాల్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్‌లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.

News January 3, 2025

మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

image

ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.