News March 5, 2025
అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే యుద్ధమే ఇస్తాం: చైనా

అమెరికా ఏ యుద్ధాన్ని కోరుకుంటే ఆ యుద్ధాన్నిస్తామని చైనా రాయబార కార్యాలయం తాజాగా తేల్చిచెప్పింది. ‘ఫెంటానిల్ డ్రగ్ అనేది సుంకాలు పెంచేందుకు అమెరికా చూపిస్తున్న ఓ కారణం మాత్రమే. వాణిజ్యమైనా, మరే రూపంలోనైనా అమెరికా కోరుకునేది యుద్ధమే అయితే అది ఇచ్చేందుకు, చివరి వరకూ పోరాడేందుకు మేం సిద్ధం’ అని స్పష్టం చేసింది.
Similar News
News March 6, 2025
నేడు క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సమగ్ర కులగణనకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.
News March 6, 2025
గంటకు 3 లక్షల కి.మీ.. నెలలోపే మార్స్‌పైకి

రష్యా ఓ అద్భుత రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కృతం చేసింది. మార్స్‌పైకి వెళ్లేందుకు అత్యంత వేగవంతమైన ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది గంటకు 3,13,822 కి.మీ వేగంతో నింగిలోకి దూసుకెళ్తుంది. దాదాపు 30 నుంచి 60 రోజుల్లోనే ఇది అంగారకుడిపైకి చేరుకుంటుంది. 2030 నాటికి దీనిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రోసాటామ్ భావిస్తోంది.
News March 6, 2025
హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

ఉగ్రవాద సంస్థ హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం, ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించడం కోసం ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హమాస్‌ను 1997లో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.