News February 4, 2025

ఆస్తులపై పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం: కేంద్ర హోంశాఖ

image

విభజన సమస్యలను తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై AP, TG అధికారులతో ఆయన చర్చించారు. ఆస్తులు తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు ప్రాంతాలకూ నష్టం వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు సమాచారం.

Similar News

News April 1, 2026

నయన్ సెన్సేషన్.. ఒకేసారి 5 భాషల్లో!

image

నటి నయనతార ఒకేసారి 5 భాషల్లో అగ్ర హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా తమిళ్‌లో 2 చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. మరొకటి షూటింగ్ జరుపుకుంటోంది. మలయాళంలో 2 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కన్నడలో నయన్ యాక్ట్ చేసిన టాక్సిక్ రిలీజ్‌కు సిద్ధమైంది. అటు బాలీవుడ్‌లో ఇప్పటికే షారుఖ్‌తో నటించిన ఆమె తాజాగా సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

News April 1, 2026

Gmail ఐడీకి తోకలు.. గుడ్‌న్యూస్ చెప్పిన పిచాయ్

image

పాత Gmail ఐడీలో ‘తోకలు’(saiRam143), వింత పేర్లున్నాయని ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మీకోసం ఓ అదిరిపోయే అప్‌డేట్ తెచ్చింది. మీ పాత యూజర్‌నేమ్ మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీనికోసం గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అందుబాటులో ఉన్న నచ్చిన పేరును ఎంచుకోండి. పాత ఐడీ అలాగే ఉన్నప్పటికీ రెండు పేర్లతోనూ సైన్ ఇన్ అవ్వొచ్చు. ID మార్చుకునేవారికిది శుభవార్తే.

News April 1, 2026

ఇవాళ 11amకు YS జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం YS జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ ప్రకటించింది. ఇవాళ పార్లమెంటులో రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జగన్ ప్రెస్‌మీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధానిపై పార్టీ స్టాండ్ ఏంటో ప్రకటించే ఆస్కారముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.