News April 27, 2024

బీజేపీ కుట్రలు చేస్తుంటే.. కేసీఆర్ స్పందించరా?: రేవంత్

image

TG: రాజ్యాంగాన్ని మార్చేందుకు BJP కుట్రలు చేస్తుంటే KCR స్పందించరా? అని CM రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘BRS, BJPవి కుమ్మక్కు రాజకీయాలు. మల్కాజ్‌గిరిలో BJPని గెలిపిస్తామని MLA మల్లారెడ్డి అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోరా? 5 నియోజకవర్గాల్లో BJPకి BRS మద్దతిస్తోంది. నేను రుణమాఫీ చేస్తానని చెప్పగానే భూములు అమ్మవద్దని ఈటల కండీషన్లు పెడుతున్నారు. గతంలో KCR అమ్ముతుంటే ఎందుకు మాట్లాడలేదు?’ అని ధ్వజమెత్తారు.

Similar News

News January 22, 2026

ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

image

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్‌కు గురి చేసిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

News January 22, 2026

మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

image

AP: రియల్ ఎస్టేట్‌ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.

News January 22, 2026

CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<>CCMB<<>>) 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీఎస్సీ, పీజీ (నేచురల్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ), BE/BTech, MBBS, PhD అర్హతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in