News November 30, 2024
బోనస్ ఇస్తే రైతుబంధు రాదా? ప్రభుత్వం ఏమందంటే!
TG: క్వింటా సన్నరకం వరికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతుభరోసాను తొలగిస్తారని చాలా మంది భావిస్తున్నారు. దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సంక్రాంతికి ఎకరాకు రూ.7వేల చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ప్రకటించారు. బోనస్ కొనసాగిస్తూనే రైతుభరోసా కూడా ఇస్తామన్నారు. నేటి రైతు సదస్సులో సీఎం రేవంత్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Similar News
News November 30, 2024
ISKCON బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్
హిందువులపై దాడుల్ని పట్టించుకోని బంగ్లాదేశ్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. 17 మంది ISKCON ప్రతినిధుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఆ సంస్థను నిషేధించాలన్న పిటిషన్‌ను బంగ్లా హైకోర్టు తిరస్కరించిన కొద్ది వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆ అకౌంట్లకు చెందిన అన్ని లావాదేవీలు సస్పెండ్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను BFIU ఆదేశించింది. వీటిలో అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ A/C సైతం ఉంది.
News November 30, 2024
రామ్ చరణ్ ‘RC16’లో మున్నా భాయ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా బుచ్చి బాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ రోల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు నటిస్తున్నట్లు ప్రకటించారు. ‘మన భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా’ అని పేర్కొంటూ ఓ పోస్టర్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News November 30, 2024
ఆటోను మినీ లైబ్రరీగా మార్చేశారు!
బెంగళూరు ఆటో డ్రైవర్లు సరికొత్త ఇన్నోవేటివ్స్తో నెట్టింట వైరలవుతుంటారు. తాజాగా మరో డ్రైవర్ తన ఆటోను కస్టమర్ల కోసం మినీ లైబ్రరీగా మార్చేశారు. అందులో పదుల సంఖ్యలో పుస్తకాలను ఉంచారు. దీంతోపాటు కస్టమర్లకు ఏ పుస్తకమైనా నచ్చితే ఉచితంగా తీసుకోవచ్చని స్టిక్కర్ అంటించారు. ఓ నెటిజన్ దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.