News September 23, 2024

పిల్లలిద్దరూ ప్రయోజకులైతే.. ఆ తల్లికింకేం కావాలి!

image

పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వారికి నచ్చిన చదువు, నైపుణ్యం ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు వెనకాడరు. అయితే, కొందరు మాత్రమే ప్రయోజకులై తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి పేరుతెస్తుంటారు. దేశానికి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లను అందించిన ప్రజ్ఞానంద, వైశాలీల తల్లి నాగలక్ష్మి ఈరోజు ఎంతో గర్వపడి ఉంటారు. కూతురు, కుమారుడు ఇద్దరూ నేడు ప్రపంచ ఛాంపియన్లయ్యారు.

Similar News

News September 23, 2024

పిల్లలకు లైంగిక విద్య అవసరం: సుప్రీం కోర్టు

image

పిల్లలకు లైంగిక విద్య అత్యంత ఆవశ్యకమని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ ఉండాలని పేర్కొంది. ‘లైంగిక విద్య పాశ్చాత్యుల విధానమని, మన వద్ద ప్రారంభిస్తే పిల్లలు చెడిపోతారని ఓ దుష్ప్రచారం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం.. సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ వారిలో అవగాహనను పెంచుతుంది. తద్వారా వారు పోర్న్‌కు, లైంగిక నేరాలకు అలవాటు పడకుండా ఆపే అవకాశం ఉంటుంది’ అని తెలిపింది.

News September 23, 2024

అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు

image

UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్‌ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.

News September 23, 2024

భారత్‌లో ఎంపాక్స్ క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ

image

కేర‌ళ‌లో గ‌త వారం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిన‌ వ్య‌క్తిలో క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధార‌ణ అయ్యింది. ఈ స్ట్రెయిన్ వ‌ల్లే డబ్ల్యూహెచ్‌ఓ గ‌త నెల‌లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చిన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. ప్ర‌స్తుతం రోగి ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.