News April 21, 2024
చంద్రబాబు గెలిస్తే రాక్షస రాజ్యమే: ముద్రగడ

AP: చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతోందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. గత చంద్రబాబు పాలనలో రాక్షస రాజ్యం అనుభవించామని.. కిర్లంపూడిని పాకిస్థాన్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇస్తున్న మోసపు హామీలను నమ్మితే పేదలకు ఆక్సిజన్ కూడా దొరకదని అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలనే ప్రకటిస్తున్న బాబు రాక్షస పాలన మనకు అవసరమా? అని ప్రశ్నించారు.
Similar News
News April 8, 2026
హార్ముజ్ తీర్మానంపై రష్యా, చైనా వీటో!

హార్ముజ్ జలసంధిని రీఓపెన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న UNSC తీర్మానాన్ని వీటో ప్రయోగించి రష్యా, చైనా రిజెక్ట్ చేశాయి. బహ్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి US సహా 11 దేశాలు మద్దతు తెలిపాయి. UNSCలో చైనా, రష్యా, US, UK, ఫ్రాన్స్‌కు ఈ వీటో అధికారం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క దేశం వీటో అధికారాన్ని ఉపయోగించినా తీర్మానం వీగిపోతుంది. ఇరాన్‌కు మద్దతుగా ఆ ఇరు దేశాలు తీర్మానం రిజెక్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
News April 7, 2026
వెలిగొండ నిర్వాసితులకు మంత్రి శుభవార్త

AP: వెలిగొండ నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900CRను ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా చెల్లిస్తామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ నాటికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. CM CBN 10 రోజులకు ఒకసారి ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికి 70% హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్లు తెలిపారు.
News April 7, 2026
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు GOOD NEWS

TG: జీతాల కోసం ప్రతి నెలా 20వ తేదీ వరకు ఎదురుచూసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే నెల నుంచి ఇది పక్కాగా అమలు చేయాలని, ఏప్రిల్ నెల జీతం మే 1వ తేదీన ఖాతాల్లో వేయాలని స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 4.80లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు.


