News April 4, 2024
చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు గుర్తొస్తాయి: సీఎం జగన్

AP: 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు గుర్తుకు వస్తాయన్నారు. ‘జగన్కు నా అనేవాళ్లు పేదలు. చంద్రబాబుకు నా అనేవాళ్లు నాన్ లోకల్స్ అయిన TV5, ABN, ఈనాడు, దత్తపుత్రుడు. వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 29, 2025
ప్రకాశం: ‘అభ్యంతరాలు ఉంటే తెలపండి’

ప్రకాశం జిల్లాలో కలవనున్న కందుకూరు, అద్దంకి డివిజన్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కందుకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలను, కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 2 మండలాలను కందుకూరులోకి కలుపుతూ.. అలాగే కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలను ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని, దీనికై సూచనలు ఇవ్వాలన్నారు.
News November 29, 2025
అప్పటికల్లా నక్సలిజం అంతం: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్పూర్లో జరిగిన DGP, IGP సదస్సులో మాట్లాడారు. తదుపరి కాన్ఫరెన్స్ జరిగే నాటికి ముందే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఏడేళ్లుగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2014లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 ఉండగా, ప్రస్తుతం 11కి తగ్గినట్లు వెల్లడించారు.
News November 29, 2025
పేదల కోసం అర్ధరాత్రి వరకూ ఉంటా: CJI

తన కోర్టులో లగ్జరీ వ్యాజ్యాలకు చోటుండదని.. పేద కక్షిదారులే తన తొలి ప్రాధాన్యత అని CJI సూర్యకాంత్ స్పష్టంచేశారు. తిలక్ సింగ్ డాంగీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత ఆయన స్పందిస్తూ.. “చివరి వరుసలో ఉన్న పేదవారి కోసం నేను ఇక్కడ ఉన్నాను. అవసరమైతే అర్ధరాత్రి వరకూ కోర్టులో కూర్చుంటాను” అని అన్నారు. సంపన్నులు వేసే అనవసర కేసులకు సమయం వృథా చేయబోనని వ్యాఖ్యానించారు.


