News August 4, 2025
రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వాడుతాం: మంత్రి

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని CM చంద్రబాబు ఈనెల 15న ప్రారంభిస్తారని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. మహిళలు బస్సులో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలన్నారు. అటు రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వినియోగిస్తామని తెలిపారు. పాఠశాలల వేళల్లో వాటిని వాడబోమన్నారు. 2 రోజుల్లో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు చేపడుతామన్న మంత్రి, త్వరలోనే కారుణ్య నియామకాలు భర్తీ చేస్తామని వివరాలు వెల్లడించారు.
Similar News
News August 16, 2025
ఒప్పందం చేసుకోమని జెలెన్‌స్కీకి చెప్తా: ట్రంప్

అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షుల సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. ‘రష్యాతో ఒప్పందం చేసుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచిస్తాను. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశమే ఎక్కువుంది. పుతిన్-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నాను. జరిగితే ఆ భేటీలో నేను కూడా ఉండే అవకాశం ఉంది’ అని తెలిపారు. పుతిన్‌తో ఏయే అంశాలపై చర్చించారు అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.
News August 16, 2025
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బాబ్ సిమ్సన్(89) కన్నుమూశారు. 1957 నుంచి 1978 వరకు 68 టెస్టులు ఆడిన ఆయన 4,869 రన్స్ చేశారు. 71 వికెట్లు పడగొట్టారు. అయితే 1968లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సిమ్సన్ 1977లో 41 ఏళ్ల వయసులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ మరుసటి ఏడాదే రిటైర్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లోనే AUS 1987 WC, యాషెస్ సిరీస్ గెలిచింది.
News August 16, 2025
ప్చ్.. ‘బ్యాడ్’మింటన్

భారత బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సైనా, సింధు, శ్రీకాంత్, సాత్విక్, చిరాగ్ వంటి షట్లర్లు వరల్డ్ టాప్ ర్యాంకులను ఏలారు. ఇప్పుడేమో టాప్10లో సాత్విక్-చిరాగ్ జోడీ(9) మినహా ఎవరూ లేరు. 15లో సింధు, 21లో లక్ష్యసేన్ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ, అకాడమీలకు ప్రోత్సాహం పెరిగాయి. ఆట మాత్రం ‘బ్యాడ్’గా మారింది.