News November 6, 2024
నాన్న గెలవకపోతే దేశం వదిలి వెళ్లిపోతా: జూనియర్ ట్రంప్

అమెరికా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లైవ్ సెషన్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఫలితాల ప్రకటన తర్వాత తన ప్రణాళిక ఎలా ఉంటుందో వెల్లడించారు. ఒకవేళ తన తండ్రి గెలవకపోతే డెమొక్రట్ల పనితీరు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను వేరే దేశానికి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ట్రంప్ 188 ఓట్లతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
Similar News
News February 4, 2026
భార్య అందంగా ఉందని గుండు గీశాడు

కర్ణాటలోని బాగల్‌కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
News February 4, 2026
HIVతో ఐదేళ్లలో 44వేల మంది బలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది HIV బాధితులు మరణించారని వెల్లడించారు. ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దీనికి కారణమని తెలుస్తోంది.
News February 4, 2026
వారణాసిలో రాముడి పాత్ర బిగ్గెస్ట్ ఛాలెంజ్: మహేశ్ బాబు

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో రాముడి పాత్ర తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని మహేశ్ బాబు అన్నారు. ‘దేవుడి పాత్రలో గాంభీర్యం కోసం మోడ్రన్ బాడీ లాంగ్వేజ్‌ను మర్చిపోవాల్సి వచ్చింది. దీనికోసం 3నెలల పాటు ‘కలరిపయట్టు’లో శిక్షణ తీసుకున్నాను. నిలబడే తీరు, నడక మార్చుకోవడానికీ ఇది హెల్ప్ అయ్యింది. రన్నింగ్ స్టైల్ ఛేంజ్ చేయడానికీ ప్రాక్టీస్ చేశాను’ అని Varietyకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ తెలిపారు.


