News June 2, 2024
ఇప్పుడు ఎన్నికలొస్తే BRSకు 105 సీట్లు వస్తాయంటున్నారు: KCR

TG: బీఆర్ఎస్‌ను మహావృక్షం, మహాసముద్రంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు సహజంగా నైరాశ్యం వస్తుంది. కానీ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెడితే మళ్లీ అదే గర్జన కనిపించింది. ఇటీవల ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎన్నికలొస్తే 105 సీట్లు గెలుస్తామని చెప్పాడు. మనం డంబాచారాలు చెప్పలేదు. PR స్టంట్లు చేయలేదు. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే’ అని KCR తెలిపారు.
Similar News
News December 4, 2025
నవాబుపేట మండలంలోని అత్యధిక ఏకగ్రీవాలు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడతలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండలంలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. మండలంలోని కాకర్జాల పల్లె గడ్డ, పుట్టోని పల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైన అధికారులు వెల్లడించారు. గండీడ్ మండలంలో అంచనపల్లి, మన్సూర్ పల్లి, మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాల గడ్డ, రాజాపూర్ మండలంలోని మోత్కులకుంట తండా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 4, 2025
పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్‌లైన్స్

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్‌కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.


