News April 21, 2024

ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓడినట్లే: అంబటి

image

AP: తాను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2019లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా.. తాను నైతికంగా ఓడినట్లే అని అన్నారు. తనకు టికెట్ రాదని కూటమి నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News January 18, 2026

తాండూరులో దారుణం.. తమ్ముడిని చంపిన అన్న..!

image

తాండూరు మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్, రెహమాన్ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య చాలారోజులుగా ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య స్థలం విషయంపై మళ్లీ చర్చ జరుగుతుండగా ఘర్షణ మొదలైంది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన మోసిన్ రెహమాన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమాన్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

News January 18, 2026

భారీ జీతంతో కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>కొచ్చిన్<<>> పోర్ట్ అథారిటీ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి పీజీ/MBA ,LLB/LLM, BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు సీనియర్ మేనేజర్‌కు రూ.1,60,000, మేనేజర్‌కు రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News January 18, 2026

జగన్ రాజధాని కామెంట్లకు CM CBN కౌంటర్

image

AP: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని జగన్ చేసిన కామెంట్లకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన బెంగళూరులో ఉంటే బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అదే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. 5ఏళ్లు ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. 3 రాజధానులు అని చెప్పిన ప్రాంతాల్లో కూడా NDA అభ్యర్థులు విజయం సాధించారని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని CBN పేర్కొన్నారు.