News January 20, 2025
తప్పు చేస్తే రుద్రాక్ష మాల తెగిపోయేది: సంజయ్

తాను ట్రైనీ డాక్టర్ను హత్యాచారం చేయలేదని సంజయ్ రాయ్ ఇవాళ కూడా వాదించాడు. తనను ఓ IPS ఈ కేసులో ఇరికించారని శిక్ష ఖరారుపై వాదనల్లో ఆరోపించాడు. ‘నేను ఈ తప్పూ చేయలేదు. నాపై కుట్ర జరిగింది. నేను నేరం చేసి ఉంటే రుద్రాక్షమాల తెగిపోయేది. అలా జరగలేదంటే మీరే అర్థం చేసుకోండి’ అని వాదించాడు. అటు ఉరి శిక్ష కాకుండా మరో శిక్ష ఎందుకు విధించకూడదో చెప్పాలని సంజయ్ తరఫున కోర్టు నియమించిన లాయర్ CBIని ప్రశ్నించారు.
Similar News
News December 24, 2025
టుడే హెడ్లైన్స్

*AP నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ గెలిస్తే రూ.100 కోట్లు: CM చంద్రబాబు
*TDP-JSP చెప్పినవి అబద్ధాలని RBI డేటాతో తేలింది: జగన్
*కొత్త సర్పంచులు మంచి పాలన అందించాలి: CM రేవంత్
*KCR గర్జిస్తే సమాధానం చెప్పే దమ్ము CMకి లేదు: KTR
*TGలో DEC 31 అర్ధరాత్రి వరకు వైన్స్, 1AM వరకు బార్స్
*భారత్లో 3 కొత్త ఎయిర్ లైన్స్: కేంద్రమంత్రి రామ్మోహన్
*శ్రీలంక ఉమెన్స్పై రెండో టీ20లో భారత్ ఘన విజయం
News December 24, 2025
భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో అండర్-19 ఆసియా కప్ను పాక్ గెలుచుకుంది.
News December 24, 2025
పాన్-ఆధార్ లింక్ చేశారా? DEC 31 వరకే గడువు

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు DEC 31తో ముగియనుంది. ఆలోగా లింక్ చేయకపోతే పాన్ రద్దవుతుంది. లింక్ చేసేందుకు IT ఈ-ఫైలింగ్ <


