News December 31, 2024
బాగా క్రికెట్ ఆడితే నాకు పీఆర్ అవసరం రాదు: ధోనీ

సోషల్ మీడియా, PR క్యాంపెయిన్లపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘SMకు నేనెప్పుడూ పెద్ద అభిమానిని కాదు. 2004లో నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టా. ఆ సమయంలో ట్విటర్ కాస్త పాపులర్ అవుతోంది. ఆ తర్వాత ఇన్స్టా వచ్చింది. మనం కూడా పీఆర్ క్యాంపెయిన్ చేద్దామని నా మేనేజర్లంతా చెప్పేవారు. అయితే నేను వద్దన్నాను. నేను క్రికెట్ బాగా ఆడితే PR అవసరం రాదని వారికి చెప్పా’ అని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే ఆద్యురాలు: కలెక్టర్

కుల, లింగ వివక్షలను ఎదుర్కొని బాలికల విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషి వెలకట్టలేనిదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కలెక్టర్, జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. మహిళా ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.
News January 3, 2026
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇక గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే BRS ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34శాతం నీళ్లు చాలని కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పారు.
News January 3, 2026
గాలి జనార్దన్ రెడ్డి వివాదం.. SP ఆత్మహత్యాయత్నం

కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల BJP MLA గాలి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ MLA నారా భరత్రెడ్డి వర్గాల మధ్య <<18737485>>వివాదం<<>> తలెత్తింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యుడిని చేస్తూ బళ్లారి ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు.


