News August 15, 2024

యాక్టర్ కాకుంటే ఆ పని చేసేవాడిని: నాని

image

తాను ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేసేవాడినని హీరో నాని అన్నారు. యూసఫ్‌గూడలోని పోలీస్ బెటాలియన్‌లో ట్రైనీ కానిస్టేబుళ్లతో ఆయన ముచ్చటించారు. తాను డైట్ ఫాలో కానని, అమ్మ వండిన ప్రతిదీ తింటానని చెప్పారు. ‘సరిపోదా శనివారం’ తర్వాత చేయబోయే ప్రాజెక్టులో పోలీసుగా నటించబోతున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ నేపథ్యంలో మంచి స్క్రిప్ట్ వస్తే తాను నటిస్తానని పేర్కొన్నారు.

Similar News

News October 20, 2025

మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

image

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.

News October 20, 2025

ఇవాళ బిడ్డల ఇళ్లకు పితృదేవతలు!

image

దీపావళి నాడు సాయంత్రం పితృదేవతలు ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారని నమ్మకం. వారికి దారి కనిపించటం కోసమే పిల్లల చేత దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. వీధి గుమ్మం ముందు దివిటీలను వెలిగించి గుండ్రంగా మూడుసార్లు తిప్పి నేలకు కొట్టిస్తూ ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పలికిస్తారు.
* మరిన్ని దీపావళి విశేషాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 20, 2025

నరకాసురుడి జననం

image

దితి, కశ్యప ప్రజాపతి పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచాడు. దీంతో భూమిని రక్షించేందుకు శ్రీమహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించాడు. ఆయన తన వజ్ర సమానమైన కోరతో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పైకి తీసుకు వచ్చాడు. ఆ సమయంలో భూదేవికి, వరాహ స్వామికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడే నరకాసురుడు. అతడు నిషిద్ధమైన సంధ్యా సమయంలో జన్మించడం వల్ల అసుర లక్షణాలు అబ్బుతాయి.