News August 13, 2024

నేను సీఎంగా ఉంటే ఆ జిల్లాలను కలిపేవాడిని: కిరణ్ కుమార్ రెడ్డి

image

AP: రాష్ట్రంలో జిల్లాలు విభజించి చాలా తప్పుచేశారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా ఉంటే ఆ జిల్లాలను మళ్లీ కలిపేవాడినని చెప్పారు. సమర్థుడైన చంద్రబాబు సీఎంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే బ్రిజేశ్ కుమార్‌ను తప్పించాలని లేకపోతే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు తన ముందున్న సవాళ్లను కేంద్రం సాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News December 12, 2025

నైనిటాల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు

image

<>నైనిటాల్ బ్యాంక్<<>> 185 ప్రొబేషనరీ ఆఫీసర్, CSA, తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి జనవరి 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ,CA, MBA,LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 18న ఎగ్జామ్ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nainitalbank.bank.in

News December 12, 2025

నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

image

దుబాయ్ వేదికగా నేటి నుంచి U-19 వన్డే ఆసియా కప్ జరగనుంది. గ్రూప్Aలో భారత్, పాక్, UAE, మలేసియా, గ్రూప్Bలో అఫ్గాన్, బంగ్లా, నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్‌లో UAEతో భారత్ పోటీ పడనుంది. కెప్టెన్ ఆయుశ్, వైభవ్, విహాన్, వేదాంత్, దీపేశ్, కిషన్ లాంటి ప్లేయర్లతో యంగ్ ఇండియా బలంగా ఉంది. మ్యాచ్‌లన్నీ 10.30AM నుంచి ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్ యాప్‌లో వీక్షించవచ్చు.

News December 12, 2025

రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

image

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.