News October 4, 2024
అక్రమమైతే నా ఫామ్హౌస్ను నేనే కూలుస్తా: కేవీపీ

TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్ హౌస్కు అధికారులను పంపించాలని, FTL, బఫర్ జోన్లో నిర్మాణం ఉంటే మార్క్ చేయాలని కోరారు. అది అక్రమ నిర్మాణమైతే సొంత ఖర్చులతో కూల్చేస్తానన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకూడదని, అలా వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదు అని అన్నారు.
Similar News
News January 21, 2026
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారా?

వాతావరణ మార్పుల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. పీహెచ్ బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్, సన్స్క్రీన్ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.
News January 21, 2026
పురుగు మందుల నాణ్యత, పంపిణీపై కేంద్రానికి సర్వాధికారాలు

ప్రస్తుతం అమలులో ఉన్న 1968, 1971 చట్ట నిబంధనల్లోని లోపాలను సవరించడం ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. నకిలీ మందుల నిరోధం, స్వదేశీ తయారీ ప్రోత్సాహం, జీవ పురుగు మందుల వినియోగం పెంచడం కేంద్రం లక్ష్యం. ప్రతీ పురుగు మందును పూర్తిగా పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి అనుమతిస్తారు.
News January 21, 2026
నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. అరగంట ముందే గేట్స్ క్లోజ్

నేటి నుంచి JEE మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి, ఈ నెల 24, 28 తేదీల్లో పేపర్-1, 29న పేపర్-2 పరీక్ష జరగనుంది. రోజు ఉ.9-12 గం. వరకు షిఫ్ట్-1, మ.3-6 వరకు షిఫ్ట్-2లో CBT పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. ఎగ్జామ్కు అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది హాజరుకానున్నారు. ఫోన్లు, వాచులు, ఇయర్ ఫోన్లకు పర్మిషన్ లేదు.


