News July 12, 2024
ఇండియా వెళ్లకపోతే శ్రీలంకకు ఛాన్స్!

పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ2025లో పాల్గొనకూడదని భారత్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. టోర్నీ నుంచి భారత్ వైదొలిగితే అది శ్రీలంకకు కలిసి వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయిన లంకకు ఛాన్స్ వస్తుంది. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. PAKలో కాకుండా ఎక్కడ నిర్వహించినా తామూ పాల్గొంటామని భారత్ అంటోంది.
Similar News
News November 21, 2025
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపర సేవా పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ ఆదేశాలతో ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. వేదపండితులు, పరిచారికలు, వాహన పురోహితులు తదితర ఉద్యోగాలకు 59 పోస్టులకు 18-46 ఏళ్లలోపు హిందువులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలతో DEC12 సా.5 లోపు దేవస్థానం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 21, 2025
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.
News November 21, 2025
7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్‌డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.


