News October 4, 2024

ఫ్లాప్ అయితే హీరోయిన్లనే తిడతారు: మాళవిక మోహన్

image

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం తమకు ఇవ్వరని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. హీరోయిన్ల కష్టాన్ని ఏమాత్రం గుర్తించరని చెప్పారు. ‘ఓ సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ అన్ లక్కీ అంటారు. ఆమె వల్లే పరాజయం పాలైందన్నట్లు చూస్తారు. సినిమా హిట్ అయితే మాత్రం హీరోలకు భారీ కానుకలు ఇస్తారు. హీరోయిన్లకు ఏమీ ఇవ్వరు’ అని చెప్పుకొచ్చారు. ప్రియాంక ఇటీవల బాలీవుడ్‌లో హిట్ ఐన ‘యుధ్రా’ సినిమాలో నటించారు.

Similar News

News November 3, 2025

కార్తీక పౌర్ణమి: తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఏం చేస్తారంటే..?

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి, ప్రసాదంగా కొంచెం అన్నాన్ని స్వీకరించడం వలన ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్న భక్తులకిది మంచి అవకాశం.

News November 3, 2025

CSIR-NEERIలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NEERI) మద్రాస్ కాంప్లెక్స్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.31వేలతో పాటు HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.csircmc.res.in/

News November 3, 2025

పిల్లలకు ఫోన్ చూపిస్తూ ఫుడ్ పెడుతున్నారా?

image

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్స్‌ను చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. త్వరగా ఫుడ్ తింటారనే ‘స్క్రీన్ ఫీడింగ్’ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలస్యంగా మాటలు రావడం, ఏకాగ్రత లోపించడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. భోజన సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మీరూ ఇలానే చేస్తున్నారా? COMMENT