News January 10, 2025
అది నిరూపిస్తే నేను పేరు మార్చుకుంటా: అశ్విన్
రిషభ్ పంత్ దూకుడైన ఆటతో పాటు డిఫెన్స్ బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. BGTలో పంత్ పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడనే విమర్శల నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు స్పందించారు. అతను డిఫెన్స్ చేస్తూ 10సార్లు ఔట్ అయిన క్లిప్ చూపిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పంత్ డిఫెన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదని కొనియాడారు. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పారు.
Similar News
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’ వచ్చేది ఈ OTTలోనే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.450+ కోట్లతో రూపొందిన ఈ చిత్ర OTT హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ దక్కించుకుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపాయి. అయితే, దాదాపు 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అంచనా వేశాయి.
News January 10, 2025
జై షాకు బీసీసీఐ సన్మానం
ఐసీసీ నూతన ఛైర్మన్ జై షాను సన్మానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ముంబైలో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం షాకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. షా ప్రస్తుతం బీసీసీఐలో ఏ హోదాలోనూ లేనప్పటికీ ఆయన్ను ప్రత్యేక అతిథిగా సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించాయి. బీసీసీఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఎన్నుకోనున్నారు.
News January 10, 2025
క్షమాపణలు చెబితే సరిపోతుందా?: బొత్స
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘భక్తులు భారీగా వస్తారని ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఈ ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? సామాన్యుల ప్రాణాలంటే సర్కార్కు ఇంత నిర్లక్ష్యమా’ అని ఆయన ఫైర్ అయ్యారు.