News November 9, 2024

జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీకి రావాలి: హోంమంత్రి

image

AP: వైఎస్ జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీకి రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ అనేది ఒక వేదిక. అక్కడికి రావడానికి జగన్‌కు భయం ఎందుకు? అసెంబ్లీకి వెళ్లని వారిని గెలిపించడం ఎందుకని ప్రజలు ఆలోచిస్తారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు NDAకే కట్టబెడతారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Similar News

News September 16, 2025

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 16, 2025

రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

image

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.

News September 16, 2025

మెనోపాజ్‌లో ఈ ఆహారం తీసుకుంటే మేలు!

image

ప్రతి మహిళకు మెనోపాజ్ దశ తప్పనిసరి. 40 ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా అనేక మార్పులొస్తాయి. అలసట, బరువు పెరగడం, హెయిర్‌లాస్ మొదలవుతాయి. కాబట్టి విటమిన్ డీ, కే, కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే ఫుడ్స్, ప్రొటీన్ కోసం చికెన్, గుడ్లు, చేపలు తినాలి. వీటితో పాటు గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్, క్వినోవా, పండ్లు, ఆకుకూరలు, ఈస్ట్రోజన్ పెరగడానికి నువ్వులు, అవిసెలు, బీన్స్ డైట్లో‌ చేర్చుకోవాలి.