News April 28, 2024
జాక్స్ కొడుతుంటే.. కోహ్లీ రియాక్షన్ ఇది!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన మార్క్ ప్రదర్శన చేసింది. విల్ జాక్స్ సెంచరీతో వీరవిహారం చేయగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో తనదైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 201పరుగుల లక్ష్యాన్ని కేవలం 96బంతుల్లోనే RCB చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ కొట్టిన షాట్లను విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ముఖ్యంగా టీ20 స్పెషలిస్టు రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో కొట్టినప్పుడు కోహ్లీ ఫేస్‌లో హావభావాలు వైరల్ అవుతున్నాయి.
Similar News
News January 21, 2026
జగన్ పాదయాత్ర YCPని అధికారంలోకి తెస్తుందా?

AP: గతంలో కలిసొచ్చిన పాదయాత్రనే జగన్ మళ్లీ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో 3,600kmపైగా నడిచిన ఆయన 151 సీట్లతో గెలిచారు. ఈసారి ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రజల్లోకి వెళ్లి కూటమి పాలనను ఎండగట్టడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతున్న వేళ జగన్ ఆ ఫార్ములాతోనే మళ్లీ సీఎం అవుతారని అనుకుంటున్నారా?
News January 21, 2026
RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://rgssh.delhi.gov.in
News January 21, 2026
సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.


