News March 25, 2024

కవితకు బెయిల్ రాకపోతే తీహార్‌ జైలుకే?

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఉదయం 11 గంటలకు ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే కవితకు రేపు కూడా బెయిల్ రాకపోతే ఆమెను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత లాయర్లు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ ఆమెను కలిశారు.

Similar News

News November 2, 2025

పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

image

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

News November 2, 2025

ప్రెగ్నెన్సీ నిలవాలంటే..

image

కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్‌ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక గర్భస్రావం అవుతుంది. దీన్ని సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ అంటారు. అలా అయితే ట్రాన్స్‌వెజైనల్‌ సర్‌క్లేజ్‌ అంటే వెజైనాలోంచి సెర్విక్స్‌ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు. కొన్నిసార్లు ట్రాన్స్‌అబ్డామినల్‌ అప్రోచ్‌ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా 3వ నెలలో పొట్టను ఓపెన్‌ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.

News November 2, 2025

సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ చికిత్స ఇలా..

image

సెర్వైకల్‌ ఇన్‌కంపిటెన్స్‌ ఉంటే రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్‌/ వెజైనాలో ఇన్ఫెక్షన్‌ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్‌ చేస్తారు. సెర్విక్స్‌కి కుట్లు వేయాల్సివస్తే అవి ఏ టైమ్‌లో వేయాలో నిర్ధారించుకుంటారు. లాపరోస్కోపిక్‌ సెర్వైకల్‌ సర్‌క్లేజ్‌కి ప్లాన్‌ చేస్తారు. దీనివల్ల 89 శాతం మందిలో గర్భం నిలబడి బిడ్డను కనొచ్చు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన డాక్టర్లు నిర్వహించాలి.